సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణం లో గత రాత్రి పంచా రామ క్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామి దేవాలయంలో మరియు ఉమా భీమేశ్వర స్వామి వార్ల తెప్పోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ముందుగా రాత్రి 8 గంటల నుండి బివి రాజు , వీరమ్మ పార్క్ లోని కొలను లో శ్రీ భీమేశ్వర స్వామి తెప్పోత్సవం ప్రారంభం అయ్యింది. వేలాది భక్తుల సమక్షంలో భారీ బాణాసంచా కాల్పులతో ఆహ్లదంగా తెప్పోత్సవం జరిగింది. ఇక గునుపూడి సోమారామం లో మహాశివరాత్రి నేపథ్యంలో జరుగుతున్నా శ్రీ స్వామివారి కల్యాణోత్సవాలు అంగరంగ వైభవంగా పూర్తీ చేసారు. గత రాత్రి 9 గంటల నుండి శ్రీ సోమేశ్వరుడు దేవేరులతో అపూర్వముగా హంస వాహన రూపంలో అలంకరించిన భారీ తెప్ప ఫై చంద్ర పుష్కరిణి లో పండితుల వేద మంత్రాలతో సన్నాయి వాయిద్యాల మధ్య ఆధ్యాత్మిక సేదతీరారు. బాణాసంచా కాల్పుల అందాలు ఒకదానితో ఒకటి పోటీ పడి నింగిలో అందాల పందిరి వేసాయి. సుమారు 25 వేల మంది భక్తులకు కన్నుల కైలాసం కనపడింది. గత 5 రోజులుగా వేద పండితుల మంత్రోచ్చారణ ల మధ్యవేలాది భక్తుల విశేష సందడి నడుమ, ప్రసాద వితరణల మధ్య గత 5రోజుల పాటు నిర్వహిస్తున్న కళ్యాణా మహోత్సవాలు వైభవంగా ముగిసాయి. నేటి శనివారం ఉదయం చంద్ర పుష్కారిని లో వసంతోత్సవం వెద పండితులు ఉత్సహ పూర్వకంగా నిర్వహించారు. గత 5 రోజులుగా భక్తులకు స్వచ్చంద సేవకులు, పోలీసులు అందించిన సేవలు భద్రతా ఏర్పాట్లు చక్కగా సమన్వయంగా కుదిరి అందరి ప్రశంసలు అందుకొన్నారు.
