సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణం లో గత మంగళవారం రాత్రి పంచా రామ క్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామి దేవాలయంలో మరియు ఉమా భీమేశ్వర స్వామి వార్ల తెప్పోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ముందుగా రాత్రి 8 గంటల నుండి బివి రాజు , వీరమ్మ పార్క్ లోని కొలను లో శ్రీ భీమేశ్వర స్వామి తెప్పోత్సవం ప్రారంభం అయ్యింది. వేలాది భక్తుల సమక్షంలో భారీ బాణాసంచా కాల్పులతో రాత్రి 10 వరకు ఆహ్లదంగా తెప్పోత్సవం జరిగింది. ఇక గునుపూడి సోమారామం లో మహాశివరాత్రి నేపథ్యంలో జరుగుతున్నా శ్రీ స్వామివారి కల్యాణోత్సవాలు అంగరంగ వైభవంగా పూర్తీ చేసారు. గత రాత్రి 9 గంటల నుండి శ్రీ సోమేశ్వరుడు దేవేరులతో అపూర్వముగా విశాలమైన హంస వాహన రూపంలో అలంకరించిన భారీ తెప్ప ఫై చంద్ర పుష్కరిణి లో పండితుల వేద మంత్రాలతో సన్నాయి వాయిద్యాల మధ్య ఆధ్యాత్మిక సేదతీరారు. బాణాసంచా కాల్పుల అందాలు ఒకదానితో ఒకటి పోటీ పడి నింగిలో అందాల పందిరి వేసాయి. సుమారు 25 వేల మంది భక్తులకు కన్నుల కైలాసం కనపడింది. రాత్రి 11 వరకు తెప్పోత్సవం జరిగింది. నేటి బుధవారం ఉదయం చంద్ర పుష్కారిని లో వసంతోత్సవం వెద పండితులు ఉత్సహ పూర్వకంగా నిర్వహించారు. గత 5 రోజులుగా భక్తులకు దేవాలయ సిబ్బంది ధర్మకర్తలు, స్వచ్చంద సేవకులు, పోలీసులు అందించిన సేవలు భద్రతా ఏర్పాట్లు చక్కగా సమన్వయంగా కుదిరి అందరి ప్రశంసలు అందుకొన్నారు.
