సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మార్కెట్ యార్డ్ ఎదురుగా నూతనంగా నిర్మించిన బిఆర్ కన్వెన్షన్ సెంటర్ ను, నేడు, సోమవారం కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. ఈ కన్వెన్షన్ సెంటర్ స్థానిక ప్రజలకు, వివిధ సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలకు వేదికగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ, టిడిపి పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *