సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్ : భీమవరం ప్రధాన రోడ్ల మీద రాత్రనక పగలు అనేక ఆవులు సంచరించడం వాటిని బందించి మునిసిపల్ అధికారులు వాటి యజమానులును ఎన్ని సార్లు హెచ్చరించిన ఫలితం లేకపోవడంతో పలుసారులు రోడ్లపై కూర్చున్న ఆవులను తప్పించబోయి వాహనదారులు గాయపడటం లేదా ఆవులు తీవ్రంగా గాయపడటం తరుచుగా జరుగుతున్నదే.. ఈ నేపథ్యంలో నేటి సోమవారం ఉదయం స్థానిక బివి రాజు వీరమ్మ పార్కువద్ద ఆనుకుని ఉన్న కరెంటు ట్రాన్స్ఫార్మర్ వద్ద పచ్చగడ్డి మేస్తూ ఒక ఆవు పచ్చగడ్డి తింటుంటే వర్షం నేపథ్యంలో కరెంటు షాక్ తో ఒక పెద్ద పేలుడు సంభవించి ఆవు చనిపోయింది. ఈ నేపథ్యంలో పట్టణంలో గో సేవకుడు గా, మూగజీవాలకు ఆపద్భాంధవుడు గా పేరొందిన సుంకర దాసు ఘటనా స్థలానికి వెళ్లి తగిన అధికారులకు ఫిర్యాదు చేసి ఆ ఆవు కు అంత్యక్రియలు నిర్వహించారు సుంకర దాసు మాట్లాడుతూ.. రోడ్లమీద తిరిగే ఆవుల సంఖ్య విపరీతంగా పెరిగిందన్నారు వీటిని రోడ్లమీదకు రాకుండా యజమానులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. తాను ఇప్పటికే ఎందరో అధికారులకు ప్రజా ప్రతినిధుల ద్రుష్టి కి దీనిని తీసుకొనివెళ్లానన్నారు. అయిన ఫలితం లేదని, ఉప ముఖ్య మంత్రి మంత్రి పవన్ కళ్యాణ్ అయిన ఈ పశువుల సమస్యపై ద్రుష్టి సారించాలని వాటి రక్షణ కోసం గట్టి చర్యలు తీసుకోవాలని కోరారు.
