సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ కార్య కర్తలు తమ : సమస్యల పరిష్కారం కోసం భీమవరంలోని జిల్లా కలెక్టరేక్టట్ వద్ద ధర్నా చేసి నిరసన తెలిపారు . ఈ సందర్భంగా స్థానిక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బి.గోపిమూర్తి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నా, అన్ని నిత్యావసర వస్తువులు, సేవలు ధరలు పెరుగుతున్నాయి కానీ, అంగన్వాడీలకు మాత్రం వేతనాలు పెంచకపోవడం దారుణమన్నారు. మాత శిశు సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలకు నిధులు పెంచాలని, అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు ఏర్పాటుచేయాలని, అంగన్వాడీ కార్య కర్తలకు ప్రభుత్వ పథకాలు వర్తింప చేయాలని డిమాండ్ చేశారు . ఐసీడీఎస్ జిల్లా అధికారి పీడీ, డీఆర్వో వచ్చి ధర్నా చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు విని వారి వద్దనుండి విన్నతి పత్రం స్వీకరించారు .
