సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం లో నేడు, మంగళవారం డ్వాక్రా యానిమేటర్లు ఆర్పీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర సంఘం ఇచ్చిన పిలుపులో భాగంగా స్థానిక కలెక్టరేట్ వద్ద మహిళలు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. తమకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, కాల పరిమితి సర్కులర్ను రద్దు చేయాలని, వివో ల మేర్జీ నీ ఆపాలని, రాజకీయ వేధింపులు అరికట్టాలని నినాదాలు చేశారు.ఈ సందర్భంగా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ అజయ్ కుమారి మాట్లాడుతూ .. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక డ్వాక్రా గ్రూపులను వాటి పని చూసే గ్రామ సంఘాలను యానిమేటర్లను గాలికి వదిలేసారు అని అన్నారు. 10000 వేతనం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ ఎనిమిది వేలు మాత్రమే ఇస్తున్నారని అన్నారు. కాల పరిమితి సర్కులర్ పేరుతో యానిమేటర్లను ఆర్పీలను బెదిరింపులకు గురి చేస్తున్నారని అన్నారు. తదుపరి, శ్రామిక మహిళ జిల్లా నాయకురాలు డి కళ్యాణి, సిఐటియు జిల్లా నాయకులు ఎం ఆంజనేయులు తదితర నేతలు కలెక్టరేట్లోకి ఊరేగింపుగా వెళ్లి కలెక్టరేట్ ఏఓకి వినతిపత్రం అందజేశారు. సమస్యలు పరిష్కరించకపోతే చలో విజయవాడ తప్పదని నినదించారు.
