సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం లోని జిల్లా కలెక్టరేట్ లో నేడు, సోమవార వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ చైర్మన్ రావూరి బాలరాజు మరియు వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఏపీ చైర్మన్ పర్రిపాటి శ్రీను మరియు భీమవరం మాజీ బార్ కౌన్సిల్ ప్రెసిడెంట్ న్యూటన్ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. తదుపరి, వారు భీమవరం మండలం దిరుసుమర్రు గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ క్యాలండర్లు ను, టీచర్స్ కు విద్యార్థులకు అందజేసి మానవ హక్కులపై వాటిపై స్వాదించవలసిన తీరుపై వారికీ అవగాహన సదస్సు ను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దిరుసుమర్రు గ్రామ సర్పంచ్ కోళ్ల బాలకృష్ణ, గొల్లవానితిప్ప సర్పంచ్, ఎంపీటీసీ నాగమణి తదితరులు పాల్గొనడం జరిగింది.
