సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్ భీమవరం లో ఇటీవల రిలీజ్ అయిన సంక్రాంతి సినిమాలు కలెక్షన్స్ దుమ్ము దులిపాయి. తెలుగు సినిమాకు వాటిని ప్రదర్శించే థియేటర్స్ కూడా ఇంకా డిమాండ్ ఉందని తేలిపోయింది. టౌన్ మొత్తంపై సినిమాల కలెక్షన్స్ వివరాలు చుస్తే.. ప్రభాస్ హీరోగా వచ్చిన రాజాసాబ్ సినిమా 3 వారాలకు 1కోటి 35 లక్షలు కలెక్షన్స్ సాధించగా, చిరంజీవి, వెంకీల ‘ మన శివశంకర్ వర ప్రసాద్’ 17రోజులకు 1 కోటి 42 లక్షలు వసూళ్లు సాధించింది. ఇక రవితేజ హీరోగా భర్త మహాశయులకు ..16 రోజులకు 15 లక్షలు, నవీన్ పోలిశెట్టి హీరోగా అనగనగ రాజు’ 15 రోజులకు 37 లక్షలు, శర్వానంద్ హీరోగా నారీనారీ నడుమ.. 15 రోజులకు 18 లక్షలు రూపాయలు వసూళ్లు రాబట్టాయి. రవితేజ సినిమా తప్ప మిగతా సినిమాలు అన్ని మంచి కలెక్షన్స్ తో ఇప్పటికి ప్రదర్శితమౌతున్నాయి.
