సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇండియన్ సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా అమితాబ్. కమల్ హాసన్ కీలక పాత్రలలో దిశా పటాని హీరోయిన్ గా దీపికా పడుకొనే ముఖ్య పాత్రలో దర్శకుడు నాగ్ అశ్వి న్ తెరకెక్కించిన భారీ యాక్షన్ చిత్రం “కల్కి 2898 ఎడి” చిత్రం ప్రపంచవ్యాప్తం గా రూ. 1100కోట్లు కలెక్షన్స్ రాబట్టి రికార్డులమీద రికార్డులు నమోదు చేస్తూ ఓవర్ సిస్ కలెక్షన్స్ కాకుండా భారత్ దేశంలో బాహుబలి 2 తరువాత అత్యంత ఎక్కువ కలెక్షన్స్ సాధించిన 2వ చిత్రంగా నమోదు అయ్యి ఇండియన్ సూపర్ స్టార్ గా భీమవరం బ్రాండ్ ప్రభాస్ స్తానం సుస్థిరం చేసింది. భీమవరం పట్టణంలో ఇప్పటికే కల్కి 2 కోట్ల 60 లక్షల కలెక్షన్స్ వసూళ్లు సాధించి బాహుబలి 2 సినిమా 3 కోట్ల 60 లక్షలు తరువాత సినిమా 2కోట్ల 80 లక్షలు తాజగా 3వ స్థానంలో 5వారాలకు కల్కి 2కోట్ల 60 లక్షలు లో నిలబడటం . ఇక కల్కి సినిమా ఓటీటీ విడుదలపై ఓ వార్త వినిపిస్తోంది. ఈ ఆగస్ట్ 23 నుంచే ఓటిటిలో అందుబాటులో ఉండనున్నట్టుగా వినిపిస్తుంది. కల్కి సౌత్ ఓటిటి హక్కు లను స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు కొనుగోలు చేయగా, హిందీ డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *