సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: న్యూఢిల్లీలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ‘గ్లోబల్ ఏఐ సమ్మిట్‘లో అక్రమంగా చొరబడి విదేశీ ప్రముఖుల ముందు దేశ ప్రతిష్టను మసకబార్చేలా ప్రవర్తించిన అసభ్యంగా ప్రవర్తించిన యూత్ కాంగ్రెస్ నాయకులను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా యువమోర్చా (BJYM) ఆధ్వర్యంలో నేడు, సంవిదిరం భీమవరం ప్రకాశం చౌక్ వద్ద దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసన చేపట్టారు. మొదట స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు యత్నించారు. ఈ క్రమంలో పోలీసులు బారికేడ్లు పెట్టి అడ్డుకోవడంతో కొద్దిసేపు పోలీసులకు, బీజేవైఎం శ్రేణులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం ప్రకాశం చౌక్ వద్దకు చేరుకున్న కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మకు పెట్రోల్ పోసి దహనం చేసి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కలిదిండి వినోద్ వర్మ,బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పైడికొండల సింధు, బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి వినయ్, తదితరులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
