సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్ర విభజన వంటి దారుణం చేసిన తరువాత ప్రజలకు దూరం అయిన కాంగ్రెస్ పార్టీని పునరుత్తేజం తేవడానికి ఇటీవల గోదావరి జిల్లాలలో పర్యటిస్తున్న పార్టీ AP అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు హరికుమార్‌రాజు, సమక్షంలో భీమవరంలోని ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో జిల్లాలోని 7నియోజకవర్గాల నుంచి వచ్చిన పార్టీ నాయకులుతో ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి ఫై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. జిల్లా పార్టీ అధ్యక్షుడు అందరికి కలుపుకుని ముందుకు సాగాలన్నారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లోని పట్టణ, మండల, గ్రామ స్థాయిల్లో కమిటీలను ఏర్పాటు చేసి పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకోవాలి. ప్రజా సమస్యలపై పోరాటం చెయ్యాలి. రాష్ట్రంలో కూటమి సర్కార్ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను పూర్తిస్థాయిలో అమలు చెయ్యలేకపోయిందని ప్రత్యేక హోదా విభజన హామీలను అమలు చేసే సత్తా ఒక్క కాంగ్రెస్ పార్టీకే ఉందన్నారు.
