సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో స్టేట్ లెవెల్ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో పోలీసు ఉద్యోగాలలో భాగంగా కానిస్టేబుళ్ల ఎంపికకు కోసం రేపు, ఆదివారం జనవరి 22వ తేదీన.. రాతపరీక్ష నిర్వహణ కోసం పశ్చిమ గోదావరి జిల్లాలో 18,190 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. జిల్లా వ్యాప్తంగా కానిస్టేబుళ్ల ప్రిలిమినరీ రాత పరీక్షకు జిల్లాలో అన్ని ఏర్పాట్లూ చేశారు.భీమవరం , వీరవాసరం, తాడేపల్లిగూడెం , తణుకు,లలో 40 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహిస్తారు. అభ్యర్థులు 30 నిమిషాల ముందుగానే కేంద్రానికి చేరుకోవాలి. భీమవరం కొత్త బస్టాం డ్ నుంచి ఎస్పీ రవి ప్రకాష్ ఆదేశాల ప్రకారం పరీక్షా కేంద్రాలకు బస్సు సౌకర్యాలు ఏర్పాటు చేసారు. పరీక్షా కేంద్రాలు వివరాలు: విష్ణుపూర్ పరిధిలోని శ్రీవిష్ణు మహిళా ఇంజినీరింగ్ కళాశాల , విష్ణుఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ , డాక్టర్ బీవీరాజు కళాశాల, శ్రీమతి బి.సీతాపాలిటెక్నిక్ , విష్ణు ఫార్మసీ కళాశాల కేంద్రాలలో మరియు డాక్టర్ సి ఎస్ఎన్ డిగ్రీ, పీజీ కళాశాల , బ్రౌనింగ్ జూనియర్ కళాశాల , ఎస్ఆర్కేఆర్ ఇంజినీరింగ్ కళాశాల – ఎ, బి సెంటర్లు , శ్రీచైతన్య జూనియర్ కళాశాల, ఆదిత్య జూనియర్ కళాశాల సెం టర్-ఎ , శ్రీసాయి ఆదిత్య జూనియర్ కళాశాల సెం టర్-బి, కొమరాడరోడ్డు, కె.జి.ఆర్.ఎల్ డిగ్రీ కళాశాల, కేజీఆర్ఎల్ పీజీ కోర్సులు, కేజీఆర్ఎల్ ఫార్మసీ కళాశాల, ఆదిత్య డిగ్రీ కళాశాల , వి.ఎస్.కె డిగ్రీ కళాశాల, దిర్సుమర్రు వెళ్లేదారిలో డీఎన్నార్ ఇం జినీరింగ్ కళాశాల సెం టర్ -ఎ, బి , డీఎన్నార్ కళాశాల,జువ్వలపాలెం రోడ్డు లోని శ్రీఆదిత్య డిగ్రీ కళాశాల లో నిర్వహిస్తారు. కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య ఆయా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది.
