సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం లోని పవిత్ర పంచా రామ క్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్థన స్వామి వార్ల దేవస్థానం నందు కార్తీకమాసోత్సవములు సందర్భముగా నేడు, శుక్రవారం కార్తీక పౌర్ణమి , ప్రతి ఇంట నోముల పండుగ నేపథ్యంలో వేలాదిగా భక్తులు పోటెత్తారు. నేటి సాయంత్రం స్వామి వారి విశిష్ట అలంకరణ ఫై చిత్రంలో చూడవచ్చు.. నేడు, ఉచిత దర్శనాలతో పాటు (14వ రోజు సందర్భముగా) సేవల వలన రూ.1,800/-లు, రూ.200/- దర్శనం టిక్కెట్ల వలన రూ.69,000/-, రూ.100/-లదర్శనం టిక్కెట్ల వలన రూ.69,500/-, రూ.50/-ల దర్శనం టిక్కెట్ల వలన రూ.72,500/-, కానుకలు సమర్పణల వలన రూ.205/-లు, లడ్డు ప్రసాదం వలన రూ.17,370/-లు, అన్నదానం ట్రస్టు నిమిత్తం రూ.61,850/-లు, మొత్తంరూ.2,92,225/-లు వచ్చి యున్నది. దేవస్థానం అన్నదానం ట్రస్టు చే 4,300 మందికి అన్నప్రసాదం వితరణ జరపటం జరిగిందని ఆలయ ఇఓ డి రామకృష్ణంరాజు ఒక ప్రకటనలో తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *