సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో గత 5 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఎగువ నుండి యనమదుర్రు డ్రైన్ కు వరద నీరు చేరుతున్న పరిస్థితుల్లో గట్లను పరిశీలించాలని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు .ఈ మేరకు నేడు, సోమవారం స్థానిక క్యాంప్ కార్యాలయంలో అధికారులతో ప్రస్తుత పరిస్థితి పై సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం యనమదుర్రు డ్రై న్ కు ఒకటవ ప్రమాద హెచ్చరిక ను జారీ చేయగా, ఇప్పుడు ఇప్పుడే నీటిమట్టం క్రమేపి తగ్గుతుందని కాబట్టి భయాందోళన పడనవసరం లేదని ఆయన అన్నారు. అయినప్పటికీ గట్టు ఎక్కడైనా బలహీనంగా ఉంటే ఆ ప్రదేశంలో గట్టును పటిష్టం చేసే విధంగా ముందస్తుగానే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదే మాదిరిగా డ్రై న్ కు ఉన్న ఇన్ లెట్లు, అవుట్లెట్లను కూడా పరిశీలించాలని సూచించారు. ఈ సమావేశంలో డి ఈ శ్రీనివాస్ ఏ ఈ వినయ్ కుమార్ లు పాల్గొన్నారు. నేడు, సోమవారం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ తన కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి లబ్ధిదారులకు వచ్చిన 5 చెక్కులను పంపిణీ చేశారు .భీమవరం నియోజకవర్గంలో ఐదు గురు లబ్ధిదారులకు రూ రెండు లక్షల 28 వేలు మంజూరయ్యాయని, ఆ చెక్కులను లబ్ధిదారులకు అందించడం జరిగిందని అన్నారు. వైయస్సార్ ఆరోగ్యశ్రీ పేరిట సామాన్య, మధ్యతరగతి, పేద ప్రజలకు కార్పొరేట్ ఆసుపత్రులలో ఉచిత వైద్యాన్ని అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కిందని అన్నారు.
