సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో లెప్రసీ కాలనీ నివాసం ఉంటున్న ఒక తాపీమేస్త్రి కూతురు మొన్నటి నుండి కనపడకపోవడంతో ఆ కుటుంబం ఆందోళనతో వెతుకులాడి ఎక్కడ ఎక్కడ కనిపించక పోవడంతో చివరకు నిన్న బుధవారం ఆ తండ్రి తమ కుమార్తె కనిపించడం లేదని భీమవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అదృశ్యమైన మూడు రోజుల తర్వాత స్థానికులు నేడు, గురువారం వెదుకులాటలో ఇంటి వెనుకన ఉన్న పొదల్లో వెతకగా మూట కట్టిన సంచి లో అనుమానాస్పద రీతిలో ఆ బాలిక మృతభేహం కనిపించడంతో అందరూ హతాశయులయి పోలీసులు కు సమాచారం ఇవ్వడం .. జిల్లా ఎస్పీ తో సహా పోలీసులు తరలి వచ్చి ఆ మృతదేహం పరిశీలించి పోస్ట్ మార్థం కు పంపించారు. స్థానికులను విచారించగా మృతురాలు బాబాయ్ పొంతన లేని మాటలలతో ఆందోళనగా ఉండటంతో అతనిని అనుమానితునిగా గుర్తించి విచారిస్తున్నారు. సొంత బాబాయ్ హంతకుడగా మారి చిత్ర హింసలు పెట్టి అమాయక బాలికను హత్య చేశాడా ? ఆ బాలిక ఎంతటి బాధతో చనిపోయిందోనని మృతభేహం చూసినవారు కన్నీరు పెట్టుకొంటున్నారు. బాలిక దారుణ హత్య కు కారణమైన హంతకులను కఠినంగా శిక్షించాలని, బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని వివిధ సం ఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
