సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో నేడు, ఆదివారం తెల్లవారు జామునుండి భారీ వర్షాలు పడుతున్నాయి, ముఖ్యంగా భీమవరం నేటి ఉదయం 7న్నర గంటల నుండి 8న్నర ఒక్కసారిగా పెనుగాలులతో భారీ వర్షం కురిసింది. దానితోనే పట్టణంలో లోతట్టు ప్రాంతాలతో పాటు ప్రధాన రహదారులపై డ్రైన్స్ నిండిపోయి నీరు పారింది. ఒక గంట విరామం ఇచ్చి మరో దఫా గా ఆకాశం చీకటి కమ్మేసింది.భారీ శబ్దాలతో ఉరుములు, మెరుపులు, పిడుగులుతో భారీ వర్షం పడింది. విద్యుత్తూ సరఫరా కు పలు అడ్డంకులు ఏర్పడి ఉదయం 8గంటల నుండి కరెంట్ సరఫరా నిలిపివేశారు, భీమవరం పట్టణం శివారులలో భారీ పిడుగులు పడ్డాయి, ఆ పిడుగులా శబ్దానికి , మంచి కాంతితో విద్యుత్తూ ప్రసారానికి పలు ఇళ్లలో ఎలక్ట్రిక్ పరికరాలు, కంప్యూటర్స్ కరెంట్ సరఫరా లేకపోయిన దెబ్బతినడం విశేషం. ప్రజలు ఆందోళనకు గురి అయ్యారు, ఈదురుగాలులకు చెట్లు పడిపోవడం తో కరెంట్ సరఫరా పూర్తీ గా నిలిపివేశారు. వాటిని కొట్టి కరెంట్ వైర్లపై తొలగించాక సాయంత్రం 4 లేదా 5 గంటలకు కరెంట్ పునరుద్ధరిస్తామని ట్రాన్స్ కో అధికారులు తెలియజేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *