సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: శ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా నేటి శనివారం తెల్లవారు జామునుండి భారీ వర్షాలు పడుతున్నాయి, దానితోనే పట్టణంలో లోతట్టు ప్రాంతాలతో పాటు ప్రధాన రహదారులపై డ్రైన్స్ నిండిపోయి నీరు పారింది. ముఖ్యంగా భీమవరం నేటి ఉదయం 6 గంటల నుండి పిడుగులతో పెను శబ్దాలతో కూడిన కుంభ వృష్టి కురియడం తో విద్యుత్తూ సరఫరా నిలచిపోయింది. పలు ట్రాన్స్పోర్మ్ లు ధ్వసం అయ్యాయి. ఉదయం 9 గంటలకు వర్షం నెమ్మెదించిన మధ్యాహ్నం 3 గంటలకు కొన్ని ప్రాంతాలకు విద్యుత్తూ పునరుద్దరించారు. అయితే పట్టణం అన్తరా కూడా విద్యుత్తూ సరఫరా పునరుద్హరించలేదు. దానితోనే పట్టణంలో లోతట్టు ప్రాంతాలతో పాటు ప్రధాన రహదారులపై డ్రైన్స్ నిండిపోయి నీరు పారింది. ఉదయం 6న్నర కు భారీ వర్షాలకు విద్యుత్తూ సబ్ స్టేషన్ లో ట్రిప్ అయ్యి మొత్తం సరఫరా నిలచిపోయింది. భీమవరం పట్టణంలో బుధవారం మార్కెట్ లో విద్యుత్ మెయిన్ లైన్ లకు సంబందించిన క్వాయిల్స్ కాలిపోవడంతో విద్యుతు లైన్ మెన్ లు శ్రమిస్తున్నారు. మరో గంటలో సుమారు సాయంత్రం 5 గంటల లోపు పట్టణం లోని అన్ని ప్రాంతాలకు విద్యుత్తూ పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు. భీమవరం పట్టణం శివారులలో భారీ పిడుగులు పడ్డాయి, ఆ పిడుగులా శబ్దానికి , మంచి కాంతితో విద్యుత్తూ ప్రసారానికి పలు ఇళ్లలో ఎలక్ట్రిక్ పరికరాలు, కంప్యూటర్స్ కరెంట్ సరఫరా లేకపోయిన దెబ్బతినడం విశేషం. ఇంటర్ నెట్ సరఫరా కూడా నిలిచిపోవడం తో ప్రజలు వ్యాపారస్తులు ఇబ్బందులకు గురి అయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *