సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో నేడు, సోమవారం ఉదయం నుండి కుంభ వృష్టి కురిసింది. భీమవరం లో అయితే ఉదయం 7గంటల నుండి 10-30 నిమిషాల వరకు ఎడతెరపి లేని భారీ వర్షం కురవడంతో ప్రధాన పీపీ రోడ్డు కూడా జలమయం అయ్యింది. ఈ నేపథ్యంలో పలు చోట్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. కలిదిండి మండలం నేడు, సోమవారం కురిసిన భారీ వర్షాలకు తెగి పడిన విద్యుత్ వైరు తగిలి ఓ వ్యక్తి మృతి చెందాడు. కలిదిండి మండలం 1వార్డుకు చెందిన రాగాని రవి శంకర్ తన ఇద్దరు పిల్లల నాగ సత్యనారాయణ( 5th, క్లాస్), భార్గవ్(3rd క్లాస్)లను ద్విచక్రవాహనంపై స్కూలుకు తీసుకెళ్ళుతుండగా విద్యుత్ వైరు తగిలిన వెంటనే రవి కుమార్ ఘటన స్థలంలోనే మృతి చెందాడు. స్థానికులు వెంటనే గాయాలతో ఉన్న పిల్లలకు మెరుగైన చికిత్స నిమిత్తం పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు ఆసుపత్రికి తరలించారు. వారు కోలుకొంటునట్లు సమాచారం
