సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు), రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కోశాధికారి మెంటే పార్థసారథి, ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కోటికలపూడి గోవిందరావు (చినబాబు)లను భీమవరం మైత్రి కాలనీ సంక్షేమ, అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో నేడు, మంగళవారం శ్రీకృష్ణదేవరాయ కళ్యాణ మండపంలో అభినందన సత్కార కార్యక్రమం నిర్వహించారు. కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాసవర్మ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో కేజిఆర్ఎల్ కళాశాలలో చదువుకున్నానని, ఈ సభకు నాకు చదువు చెప్పిన అధ్యాపకులు హాజరవ్వడం ఎంతో ఆనందంగా ఉందని నా వంతు సహాయం ఈ కాలనీకి అందిస్తానని తెలిపారు. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ బ్యాంకు కాలనీలో మొదటగా వచ్చినప్పుడు తాగునీటి కోసం ఎన్నో కష్టాలు పడ్డానని, మైత్రి కాలనీ సంఘంలో నేను కూడా ఒక సభ్యుడునని, కాలనీ అభివృద్ధికి నా వంతు సహకారం అందిస్తానన్నారు. అనంతరం సంఘ సభ్యులు అతిథులను జ్ఞాపికలతో, శాలువాలతో పుష్పమాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సూర్యమిత్ర ఎగ్జిమ్స్ అధినేత యిర్రింకి సూర్యారావు, గనిరెడ్డి త్రినాథ్, వాసుకూరి కృష్ణమూర్తి, తోరం చిన్న వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
