సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం త్యాగరాజ భవనంలో ఆర్యవైశ్య వర్తక సంఘ ఆధ్వర్యంలో గత ఆదివారం రాత్రి కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు, ఎపిఐఐసి కార్పోరేషన్ చైర్మన్ మంతెన రామరాజు లను ఘనంగా సత్కరించారు. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ.. భీమవరంలో అన్ని సంఘాలు ఎంతో ఐక్యతతో ఉంటాయని, కూటమి గెలుపులో ఆర్యవైస్యులు కీలక పాత్ర పోషించారని భీమవరం ఆర్యవైశ్య వర్తక సంఘం సమాజ సేవలో చురుకైన పాత్ర వహిస్తుందని అన్నారు. సంఘం అధ్యక్ష, కార్యదర్శులు వబిలిశెట్టి వెంకటేశ్వరరావు, తటవర్తి నాగ బదరీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ .. కూటమి లో ఈ ప్రాంత ప్రజా ప్రతినిధులుగా గెలిచిన ,ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నత పదవులను అదిరిగించడం మన జిల్లాకే గర్వకారణమని, ఎంపీగా శ్రీనివాస వర్మ కేంద్ర సహాయ మంత్రిగా, ఎమ్మెల్యేలు అంజిబాబు పీఏసీ చైర్మన్, రఘురామ కృష్ణంరాజు డిప్యూటీ స్పీకర్ గా, మాజీ ఎమ్మెల్యే రామరాజు ఎపిఐఐసి కార్పోరేషన్ చైర్మన్ గా ఇలా పదవులను అధిరోహించడం ఆనందంగా ఉందని అన్నారు. అనంతరం వారిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పట్టణంలోని ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు.
