సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత సాయంత్రం ఢిల్లీ లో కారు ప్రమాదం నుండి కాలు గాయాలతో బయట పడిన కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ గత అర్ధరాత్రి భీమవరం లోని తన నివాసానికి చేరుకొన్నారు. ఆయనను పరామర్శించడానికి అనేక మంది పార్టీలకు అతీతంగా నేతలు బీజేపీ నేతలు వస్తున్నా నేపథ్యంలో ఆయన ప్రజల నుద్దేశించి మాట్లాడుతూ.. దేవుని దయ, కార్యకర్తలు, శ్రేయోభిలాషుల ఆశీర్వాదాలతో ఢిల్లీలో జరిగిన రోడ్డు ప్రమాదం నుండి మోకాలి గాయాలతో బయటపడ్డానుఅన్నారు. భీమవరంలోని కేంద్ర మంత్రి నివాస వద్ద నేటి గురువారం ఉదయం విలేకరులతో వర్మ మాట్లాడారు. రోడ్డు ప్రమాదం జరిగిన తీరును వివరించారు. తాను ప్రయాణిస్తున్న కారును మరొక కారు ఢీకొనడంతో కారు పూర్తిగా ధ్వంసం అయిందని, భగవంతుడే కాపాడదని తన ఆరోగ్య పరిస్థితిపై ఎవరు ఆందోళన చెందవద్దు అని కూటమి పార్టీల శ్రేయోభిలాషులు, మిత్రులు ఫోన్ చేస్తున్నారని, ఇంటికి వస్తున్నారని వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని శ్రీనివాస వర్మ అన్నారు. కేంద్ర మంత్రి వర్మ మోకాలికి బలంగా గాయం తగలటం వల్ల కొద్దిరోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఈ నేపథ్యంలో మాజీ బీజేపీ రాష్ట్ర అడ్జక్షుడు, ఎమ్మెల్సీ అభ్యర్థి సోము వీర్రాజు , మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఒకే సమయంలో వచ్చి శ్రీనివాస వర్మ ను పరామర్శించడం గమనార్హం. మిత్రులు శ్రీనివాస వర్మ త్వరగా సంపూర్ణ ఆరోగ్యం తో కోలుకోవాలని ‘సిగ్మా న్యూస్‘ తరపున కోరుకొంటున్నాం.
