సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో అన్ని ప్రధాన సెంటర్స్ బీజేపీ జెండాలతో కేంద్ర మంత్రి శ్రీనివాస కు స్వాగత ద్వారాలతో కళకళ లాడింది. ఈ నేపథ్యంలో నేటి సాయంత్రం నుండి భీమవరంలోని ఆనంద ఫంక్షన్ హాల్ నందు పశ్చిమగోదావరి జిల్లా బీజేపీ విస్తృతస్థాయి సమావేశం మరియు కేంద్ర ఉక్కు మరియు భారీ పరిశ్రమల శాఖ మంత్రి వర్యులు శ్రీ భూపతిరాజు శ్రీనివాసవర్మ గారికి అభినందన సన్మాన కార్యక్రమం ఘనంగా జరుగుతుంది. నేటి ఆదివారం సాయంత్రం 6 గంటల కు కేంద్ర సహాయమంత్రి శ్రీనివాస వర్మ దంపతులు ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది. వారికీ బాలికలు తమ సాంప్రదాయక నృత్య ప్రదర్శనలతో ఘన స్వగతం పలకడం జరిగింది. జిల్లాలోని కీలక బీజేపీ నేతలు వర్మ తో తమ అనుబంధాలు మాట్లాడుతున్న ,శ్రీనివాసవర్మ అంచెలంచెలుగా ఎంతో ఓర్పుతో ఎదిగిన నేతగా,మన జిల్లాలో బీజేపీ ని బలోపేతం చెయ్యడానికి దశాబ్దాలుగా చేసిన కృషి ఎంత ఎదిగిన ఒదిగిన తీరు, కేంద్ర మంత్రిగా విశాఖ ఉక్కు కు వేలకోట్ల నిధులు, మన పశ్చిమ గోదావరి జిల్లాకు రోడ్ల అభివృద్ధికి, వైద్య అవసరాల కోసం వందల కోట్లు కేంద్ర నిధులు సాధించారని, ఆయన శ్రీమతి కూడా బీజేపీ పార్టీకి అండగా భర్త అడుగుజాడలలో నడవడమే కాదు.. పార్టీ కార్యకర్తలను తన స్వంత పిల్లలుగా ఒక కుటుంబముగా భావించి క్యాడర్ ఎదుగుదలకు సహకరించారని వివరిస్తున్న నేపథ్యంలో నేటి రాత్రి 8-30 గంటలకు సన్మానకార్యక్రమం జరగనుంది.( పైన తాజా చిత్రాలు చూడవచ్చు)
