సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, బుధవారం భీమవరంలోని కేంద్రమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి ఉజ్వల యోజన కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ ముఖ్య అతిథిగా పాల్గొని, అర్హులైన 193 మంది మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లను పంపిణీ చేశారు. ​ఈ సందర్భంగా కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ మాట్లాడుతూ.. మహిళల అభ్యున్నతి, వారి ఆరోగ్య రక్షణకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని.. అందుకే ఎటువంటి డిపాజిట్ లేకుండా ఇంటి ఆడపడుచు పేరు మీదనే ఉచిత గ్యాస్ కనెక్షన్ మంజూరు చేయడం జరుగుతుంది. దీనితో పాటు మొదటి సిలిండర్, గ్యాస్ స్టవ్, పైపు, రెగ్యులేటర్ మరియు బ్లూ బుక్‌లను ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. ఉజ్వల వినియోగదారులకు ప్రతి సిలిండర్‌పై ₹320 సబ్సిడీ నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుందని ఆయన పేర్కొన్నారు. 2016లో ప్రారంభమైన ఈ పథకం ద్వారా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 10 కోట్ల మందికి పైగా మహిళలు ప్రయోజనం పొందారని,అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *