సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం 38వ వార్డు లంకపేటలో నేడు, శుక్రవారం కొత్త స్పౌజు పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. పేదల కళ్ళల్లో ఆనందం చూడాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని, సంక్షేమంతోపాటు అభివృద్ధికీ సమప్రాధాన్యం ఇస్తున్నామని ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. ఆయన ఇంటింటికి వెళ్లి లబ్దిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. భీమవరంలో మొత్తం 10,970 మందికి రూ 4,83,13,500 లు అందిస్తున్నామని, కొత్తగా 203 మందికి కొత్త స్పౌజు పెన్షన్లు అందిస్తున్నామని, మొత్తం 11,173 మందికిగాను రూ 4,91,25,500 లు అందిస్తున్నామని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. నేడు 11 వేల మందికి స్పౌజ్ పింఛన్లు అందించడం మంచి పరిణామమని,. మేనిఫెస్టోలో చెప్పిన హామీలన్నీ అమలు చేస్తున్నామని అన్నారు. భీమవరం మండలంలో కొత్తగా 178 స్పౌజు పెన్షన్ లు అందిస్తున్నామని, భీమవరం మండలం రాయలం గ్రామంలో కొత్తగా 20 మందికి స్పౌజు పెన్షన్ పంపిణీ చేశామని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె రామచంద్ర రెడ్డి, సచివాలయ సిబ్బంది, మండల అధికారులు, కూటమి నాయకులు, పాల్గొన్నారు.
