సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:రాష్ట్ర శాసన మండలి చైర్మన్ , కొయ్యే మోషేను రాజు కుమారుడు, కొయ్యే చిట్టిరాజు 2023 సివిల్స్ లో 833 వ ర్యాంక్ సాధించి భారత దేశ ప్రతిష్టాత్మక సర్వీస్ అయిన IPS (Indian police Service) కి ఎంపికైన తర్వాత తొలిసారిగా భీమవరం వచ్చిన సందర్బంగా నేడు, శుక్రవారం ఉదయం వైసీపీ కి చెందిన MLC వంకా రవీంద్రనాధ్ , MLC జయమంగళ వెంకటరమణ, MLC కవురు శ్రీనివాస్ భీమవరం క్యాంప్ కార్యాలయంలో అభినందనలు తెలిపారు. గత గురువారం సాయంత్రం కొయ్యే చిట్టిరాజు కి భీమవరం పట్టణం లోని ఉండి రైల్వే గేట్ వద్దనుండి పెద్ద ఎత్తున బైకులు, కార్ల తో గునుపూడి లోని Dr. B. R. అంబేద్కర్ గారి కాంస్య విగ్రహం వరకు బారీ ర్యాలీ నిర్వహించబడినది. మధ్యలో 2 టౌన్ లోని అంబెడ్కర్ విగ్రహానికి, ఆదివారం బజారు లోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఆయన పూల మాలలు వేసి నివాళ్లు అర్పించడం జరిగింది. గత రాత్రి స్థానిక గునుపూడి లోని నివాసంలో మండలి చైర్మెన్,మోషేను రాజు ఆధ్వర్యంలో శ్రేయోభిలషులు, పట్టణ ప్రముఖులు పెద్ద ఎత్తున పాల్గొని కొయ్యే చిట్టి రాజు గారికి అభినందనలు తెలిపారు.
