సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేటి మంగళవారం తో భీమవరం పరిసర ప్రాంతాలలో సంక్రాంతి సరదాలు ముగింపుకు వచ్చాయి. ఎప్పడు హైలైట్ గా నిలిచే కోడిపందాలు ఈ సంక్రాంతికి కూడా జోరుగా సాగాయి. ఎప్పటిలాగే కోట్లు రూపాయలు చేతులు మారాయి అని సమాచారం . పందేల్లో జిల్లావాసుల కంటే తెలంగాణ,రాయలసీమ,తదితర ప్రాంతాల నుంచి వచ్చిన వారే అధికంగా కనిపించారు. కోడి పందేల బరుల్లో ప్రధానంగా గుండాట, కోతాట ఎక్కువగా జరుగుతుంది. ఇందులోనే నిర్వాహకులకు లక్షలు మిగులుతాయి. కాని, ఈసారి కోడి పందాలు వరకు ఇబ్బందిలేదు కానీ 2వ రోజు పెద్ద పండుగ మధ్యాహ్నం నుండి గుండాట, కోతాటవంటి పోలీసులు ‘కోత‘ పెట్టారు. కోనసీమలోను ఇదే పరిస్థితి. ఊహించని రీతిలో జిల్లా వ్యాప్తంగా పలు బరులపై పోలీసులు పెద్దపండుగ, కనుమ రోజు దాడులు చేయడంతో నిర్వాహకులు లబోదిబోమన్నారు. కొందరు దారుణంగా నష్టపోయారు. నరసాపురం తీరంలో, తణుకు వద్ద కొన్ని బరులను రెండో రోజే మూసివేశారు. జిల్లాలో కాస్త పెద్ద స్థాయి హడావుడితో 150 బరులను నిర్వ హించారు.తొలి రోజున భోగి పండుగ ఉదయం నుంచి రాత్రి వరకు అడ్డుఅదుపు లేకుండా జరిగాయి. భీమవరం పరిసరాలలో ఈ సారి డేగపురం హైలైట్.. ఇంకా భీమవరం మండలం తుందుర్రులో.చినఅమిరం, రాయలం, ఈలంపూడి, తాడేరు, వెంప ప్రాంతాలలో కోడిపందేల జోరు సాగింది.వీరవాసరం మండలం కొణితివాడ డేగాపురం, ఆకివీడు పట్టణ శివారు దుంపగడప, కాళ్ళ మండలం సీసలి, పాలకొల్లు పూలపల్లి, పెనుమంట్ర మండలం జగన్నా థపురం, కవిటం వద్ద పెద్ద బరులు నిర్వహించారు. మిగిలిన చోట్ల మీడియం, చిన్నబరులు సాగాయి. కొన్నిచోట్ల బుల్లెట్లు, మోటార్ సైకిళ్లు, బంగారం బహుమతులు పెట్టి, బరుల వద్ద ఎల్ఈడీ టీవీలు ఏర్పాటు చేశారు. కూర్చోవడానికి గ్యాలరీలు, ఫ్యాన్లు, బిర్యానీ పాయింట్లు, వంటివి ఏర్పాటు చేశారు.పొరుగు ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో జూదరులు, రౌడీ షీటర్స్ జిల్లాకు రావడాన్ని గుర్తించిన పోలీసు శాఖ జిల్లాకు ప్రత్యేక హెచ్చరికలు చేసినట్టు సమాచారం. ఎస్పీ రవిప్రకాష్ ఆధ్వర్యంలో పోలీసులు జూదాలను మాత్రం గట్టిగ నియంత్రించారు అని అని చెప్పాలి.
