సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో 2020 నుండి 2022వరకు 2 విడతలుగా ప్రబలిన కరోనా మహమ్మారి నుండి బాధితులను రక్షించేందుకు భీమవరం పట్టణంలో ప్రభుత్వం నిర్దేశించిన ప్రముఖ హాస్పటల్స్ , క్వారంటైన్‌ లో కరోనా చికిత్స చేసిన హాస్పటల్స్ లో కరోనా సమయంలో వ్యాధిగ్రస్తుల కోసం..వారి సదుపాయాలు కోసం చేసిన జగన్ సర్కార్ ఖర్చుచేసిన బిల్లులపై విజిలెన్స్‌ రహస్యంగా దర్యాప్తు మొదలయింది? .. అన్న సమాచారంతో కొందరు ప్రభుత్వ అధికారులలో ఆందోళన మొదలైంది. కోవిద్ సోకిన వందలాది రోగులకు క్వారంటైన్‌ నిర్వహణ, విశ్రాంతి, వసతి కల్పన, భోజ నాలు, మంచినీళ్లు, బారికేడ్ల ఏర్పాట్లు వంటి ఖర్చులన్నీ భీమవరం మున్సిపాలిటీ తరపున వ్యయం చేశారు. సమర్ధవంతమైన నిర్వహణ తీరుతో మంచి పేరు కూడా సాధించారు. తర్వాత ప్రభుత్వం నుంచి నిధులు విడుదలయ్యాయి. ఈ నిధులను సక్రమంగా ఖర్చు చేశారా? లేదా అని విజిలెన్స్‌ బృందం తనిఖీలు చేపట్టింది. ప్రస్తుతం భీమవరంలో తొలి దఫా విచారణకు గత నెల చివరివారంలో కొందరు ఉద్యోగులను ఏలూరు పిలిపించారని తెలిసింది. రోగుల కోసం వేసిన షామియానా, బారికేట్ల బిల్లు సైతం లక్షలలో ఉండటంతో విజిలెన్సు అధికారులకు అనుమానాలు బయలు దేరినట్లు తెలుస్తుంది. అలాగే రోగులకు భోజనా లకు సంబంధించి భీమవరం మున్సిపాలిటీ కొంత మందికి భోజనాలు వండి పెట్టడం, కొంతమంది దాతలు సహకరించినప్పటికీ ఒక హోటల్‌ దగ్గర మొత్తం భోజనం కొనుగోలు చేసినట్లు లక్షల్లో బిల్లు పెట్టారని విజిలెన్స్‌ శాఖ విచారణ చేస్తున్నట్లు భావిస్తున్నారు. అసలు వాస్తవాలు ఏమైనా లొసుగులు నిర్ధారణ అయితే మాత్రం భీమవరం లో కొందరు అధికారులకు ఇబ్బందులు తప్పేట్టు లేవు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *