సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శనివారం ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం దినోత్సవం సందర్భముగా భీమవరంలో ఒమేగా క్యాన్సర్ హాస్పిటల్స్, భీమవరం హాస్పిటల్స్, ఎస్. ఆర్. కె. ఆర్. కాలేజీ ఎన్. ఎస్. ఎస్. యూనిట్, లయన్స్ క్లబ్, డి. ఎన్. ఆర్. కాలేజీ వాకర్స్ అసోసియేషన్ మరియు డి. ఎన్. ఆర్. కాలేజీ ఎన్. ఎస్. ఎస్. యూనిట్ వారి ఆద్వర్యంలో క్యాన్సర్ గురుంచి అవగాహన పెంపొందిచటానికి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డా. జి. గోపాల రాజు మాట్లాడుతూ.. క్యాన్సర్ ప్రారంభదశలోనే గుర్తిస్తే ఈ వ్యాది నుండి బయట పడవచ్చు అన్నారు. గాదిరాజు సత్యనారాయణ రాజు (బాబు), డి. ఎన్. ఆర్. కాలేజీ అసోసియేషన్ సెక్రెటరీ & కరెస్పాండెంట్ మాట్లాడుతూ.. అసలు క్యాన్సర్ రాకుండా మరియు ఒకవేళ వస్తే తీసుకోవలసిన జాగ్రత్తలు వైద్యులను అడిగి జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. డా. డి. హరీష్, సర్గికల్ ఆర్కాలజిస్ట్ మాట్లాడుతూ.. క్యాన్సరకు కారణాలు శరీరానికి వ్యాయామం లేకపోవడం రెడ్ మీట్ తీసుకోవటం, సిగరెట్, మద్యం, గంజాయి లాంటి అలవాట్లు ఉండటం అని అన్నారు. డా. సి. హెచ్. లోకేష్ కృష్ణం రాజు మాట్లాడుతూ.. 20 నుంచి 50 వయస్సు గల మహిళలు స్క్రీనింగ్ టెస్ట్ లు చేయించుకొని జాగ్రత్త పాటించాలని అన్నారు. ఇంకా పలువురు ప్రముఖులు, డి ఎన్ ఆర్ విద్యార్థులు పాల్గొన్నారు.
