సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరంలో క్రైస్తవ సోదరులు పవిత్ర క్రిస్మస్ నెల డిసెంబర్ ను వాడవాడలా గత రాత్రి స్థానిక చర్చలలో క్యాండిల్స్ వెలిగించి చిన్నారులు, యువతి యువకులు క్రిస్మస్ తాత టోపీ ధరించి చాకోలెట్స్ పంచుతూ క్యాండిల్స్ వెలిగించి సందడి చేసారు. ఈ నేపథ్యంలో గునుపూడిలోని సెయింట్ పీటర్స్ చర్చ్ వారు నిర్వహించిన క్రిస్మస్ క్యారల్స్ సందర్భంగా అక్కడే ఉన్న శాసన మండలి చైర్మన్ శ్రీ కొయ్యే మోషేను రాజు కు అయన క్యాంపు ఆఫీస్ కు వందలాదిగా వచ్చి ఆయనకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. కొయ్యే మోషేను కూడా వారితో కులాసాగా గడిపి .. వారికీ కూడా క్రిస్మస్ క్యారల్స్ శుభాకాంక్షలు తెలిపి ప్రపంచ మానవాళికి సాటివారికి ప్రేమ ను పంచడం ఒక జీవన గమ్యంగా చేసిన ప్రభువు స్ఫూర్తి అందరికి ఆదర్శం కావాలన్నారు.
