సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా సర్వోదయ మండలి ధర్మాన కమిటీ ఆధ్వర్యంలో భీమవరం స్థానిక తాసీల్ధార్ కార్యాలయం ఆవరణలో ఉన్న క్విట్ ఇండియా స్తూపం నిర్మించి 30 సంవత్సరాలు పూర్తి అయిందని, ఇప్పుడు శిథిలావస్థకు చేరటంతో, దానిని తిరిగి పునర్మనిర్మాణ చేపట్టామని, దీనికి ఎంతో మంది దాతలు విరాళాలు అందిస్తున్నారని, ముందుగా వసుధ ఫౌండేషన్ చైర్మన్ మంతెన వెంకట రామరాజు లక్ష రూపాయలు అందించి ప్రోత్సహించారని ,నేడు, ఆదివారం సాగిరాజు అప్పలరాజు ( సింగపూర్ అప్పన్న) లక్ష రూపాయలు, అల్లూరి సీతారామరాజు సేవా సమితి అధ్యక్ష కార్యదర్శులు గాదిరాజు సుబ్బరాజు, కలిదిండి గోపాలకృష్ణంరాజు సమితి తరపున అరవై ఐదు వేల రూపాయలు విరాళాలుగా ఇచ్చారని, త్వరలో స్తూపం ఆవిష్కర కార్యక్రమం నిర్వహిస్తామనినిర్మాణ కమిటీ జిల్లా సర్వోదయ మండలి నాయకులు చెరుకువాడ రంగ సాయి మరియు ఇందుకూరి ప్రసాదరాజు, బోండా వెంకట సుబ్బారావు, కంతెటి వెంకట రాజు, అరసవల్లి సుబ్రహ్మణ్యం తెలిపారు.
