సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ద్రోణి ప్రభావంతో గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరంలో నేటి , శుక్రవారం ఉదయం 10 గంటల నుండి మొదలైన భారీ వర్షం కుంభవృష్టిగా మారి ఆకాశం నుండి గంగళాలతో నీరు వలకబోస్తున్నట్లు సాయంత్రం 4 వరకు ఒక్కటే వర్షం.. ఇంకా కొనసాగుతూనే ఉంది. మరి ఎప్పటి వరకు ఈ వర్షం కురుస్తుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో భీమవరంలో అత్యధికంగా ఇప్పటికే 106 మిల్లీమీటర్లు నమోదయ్యింది. ఇక్కడితో ఈ వర్షాలు ఆగవు. ఈ రోజు రాత్రి వరకు ఉభయ గోదావరి జిల్లాల వ్యాప్తంగా వర్షం పడే సూచనలు ఉన్నాయి. ప్రస్తుతం భీమవరం పట్టణంలో లోతట్టు ప్రాంతాలలో వర్షం నీరు ఇళ్లలోకి వచ్చేస్తుంది. పట్టణంలో పీపీ రోడ్డు కు మంచి డ్రైనేజ్ సిస్టం ఉన్నపటికీ ప్రధాన రహదారులు కూడా అక్కడక్కడ నీటి తటాకాలు కనిపిస్తున్నాయి. హోసింగ్ బోర్డు వద్ద సెంటిమెరీస్ ఏరియా ప్రధాన రోడ్డు కూడా నీటి మడుగును తలపిస్తుంది. ఇక 5 రైల్వే టర్నల్ లలో అయితే 3 అడుగుల మేర నీరు చేరిపోయింది. అల్పపీడనం రేపు సాయంత్రం కు కాకినాడ, విశాఖ తీరంకు అతి చేరువుగా వచ్చిన తర్వాత కాకినాడ నుంచి తీరం వెంబడి 2 రోజులు ప్రయాణించనున్నది. తర్వాత దశలో ఒరిస్సా లో తీరం దాటనుంది. అని వాతావరణ శాస్త్రవేత్తల అంచనా.. మన సిగ్మా న్యూస్ లో ముందుగానే ప్రకటించినట్లు వచ్చే 11 వ తేదీ వరకు వర్షాలే.. వర్షాలు..( ఫై తాజా ఫోటో దుర్గాపురం ప్రాంతంలోనిది)
