సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో నేడు, శనివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం సుమారు 3 గంటల వరకు చాల ప్రాంతాలలో విద్యుత్తూ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు, వ్యాపార వర్గాలు తీవ్ర ఉక్కబోతలతో ఇబ్బందికి గురి అయ్యారు. ఈ రోజు భానుడు ఉదయం నుండి ప్రచండ రూపంలో చెలరేగిపోవడం మరో ప్రక్క విద్యుత్తూ సరఫరా 5 గంటల పాటు నిలిచిపోవడం ఇన్వెక్టర్స్ కూడా పనిచేయక ఇబ్బందులకు గురి అయ్యారు. విద్యుత్తూ శాఖ విద్యుత్తూ సరఫరా లైన్ లలో సంస్థాగతమైన లోపాలను సరిచేస్తూ రిపేర్లు చెయ్యడం కోసం విద్యుత్తూ నిలిపివెయ్యడం జరిగిందని కానీ అనుకోకుండా కాస్త ఎక్కువ సమయం పట్టిందని తెలిపింది.
