సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో గత ఆదివారం రాత్రి 2023 ఏడాది కి వీడ్కోలు పలుకుతూ 2024నూతన సంవత్సర వేడుకలు బాణాసంచా కాల్పులతో కోలాహలంగా జరిగాయి. అయితే ఆదివారం సెలవు దినం కావడంతో ఇంట్లోనే కుటుంబసభ్యులతో ప్రశాంత వాతావరణంలో మాంసాహార వంటకాలతో, బిర్యానీలు ఇతర తినుబండారాలు తింటూ యూట్యూబ్ ప్రసారాలు చూస్తూ ఆహ్లదంగా గడిపారు. దీనితో ఎన్నో ఆశలు పెట్టుకొన్నగత సాయంత్రం నుండి బేకరీలలో, రెస్టారెంట్స్ లలో కేకులు, స్వీట్స్, బిర్యానీల పార్సిల్ అమ్మకాలు మెల్లగా జరిగాయి. అయితే కొందరు వ్యాపారులు పరిస్థితి ముందే ఉహించి కేకులు, బిర్యానీ తయారీని తగ్గించారు. బేరాలు తగ్గిన ఎక్కడ తగ్గేదేలేదంటూ.. గతంతో పోలిస్తే ధరలు పెంచి అమ్మడం విశేషం.. ఒక కేజీ కేక్ డ్రింక్ బాటిల్ ఆఫర్ చూపి 380 రూపాయల వరకు అమ్మారు.మద్యం అమ్మకాలు ఓ మోస్తరుగా జరిగాయి. ఇక పూలు పండ్లు అమ్మకాలు కూడా భారీగా తగ్గాయి. పోలీస్ వారి హెచ్చరికలు, కమ్యూనిటీ వేడుకలు కూడా తక్కువగానే జరిగాయి.అయితే ప్రముఖ విద్య సంస్థలలో హాస్టల్ విద్యార్థులు మంచి వినోదాత్మక కార్యక్రమాలతో జోష్ గా గడిపారు. అలాగే సెక్షన్ 30 అమలులో ఉండటంతో పట్టణంలో గత రాత్రి యువత లో బైకు బాబుల, మందుబాబుల దూకుడు గతం తో పోలిస్తే చాల తక్కువ ,కనిపించింది. పోలీస్ హెచ్చరికలు ఉన్నపటికీ కొందరు అర్ధరాత్రి బాణాసంచా కాల్పులు సంబరాలు చేసారు. ఈసారి దేవాలయాలు అర్ధరాత్రి తెరుచుకోనప్పటికీ కొందరు దేవాలయాలను బయట నుండి దర్శించుకొని తృపి పడ్డారు. ఇటీవల సీఎం పర్యటనలో అలసిపోయినప్పటికీ పోలీసులు సమర్ధవంతంగా పనిచేసారు. అలాగే గతంలో మాదిరిగా యువత కూడా వారిని ఇబ్బంది పెట్టె పరిస్థితులు తెచ్చుకోలేదు. మొత్తానికి అధిక ధరలు.. మార్కెట్ స్లంప్ కూడా ఉన్న ఇబ్బందులు వల్ల కూడా భీమవరంలో నూతన ఏడాది జోష్ కొంతమేర తగ్గిందని చెప్పాలి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *