సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్ : పశ్చిమ గోదావరి జిల్లా అంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత శనివారం సాయంత్రం నుండి జల్లులతో ప్రారంభమైన వర్షం రాత్రి 7 గంటల నుండి కుంభవృష్టి గా మారిపోయి 2 గంటల పాటు ఉరుముల బీకరగర్జనలతో భారీ పిడుగుల విస్ఫోటనలతో ప్రజలను భయాందోళనలకు గురిచేసింది. భీమవరం జిల్లాలోని ప్రధాన రోడ్లు మరియు డ్రెయిన్లు, అలాగే పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయ మయ్యాయి. పట్టణంలోని డ్రెయిన్లు మరియు ప్రధాన రోడ్లు, అలాగే పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. విద్యుత్తూ సరఫరా , కేబుల్ టివి, ఇంటర్నెట్ సరఫరా అన్ని నిలచిపోయాయి. గత రాత్రి పట్టణంలో 10 గంటల సమయంలో చాల ప్రాంతాలలో విద్యుతు సరఫరా పునరుద్ధరించారు. అయితే నేటి సోమవారం ఉదయానికి మిగతా ప్రాంతాలలో విద్యుత్తూ, నెట్ సిగ్నెల్స్ పునరుద్ధరణ జరుగుతుంది. భారీ వర్షానికి పిడుగులా దెబ్బకు అనేక విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి. గృహాలలో కూడా పలువురు ఎలక్ర్టికల్ వస్తువులు దెబ్బ తిన్నాయి. అయితే నేటి సోమవారం ఉదయం నుండి ప్రచండంగా ఎండ కాయడం తో పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *