సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గర్భిణీ స్త్రీలు మంచి పౌష్టికాహారం తీసుకుంటే పుట్టబోయే బిడ్డలు బలంగా, ఆరోగ్యవంతంగా జన్మిస్తారని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. 7వ పౌష్టికాహార పక్షోత్సవాలను బుధవారం భీమవరం మున్సిపల్ కార్యాలయంలో నేడు, బుధవారం స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 15 మంది గర్భిణీలకు సామూహిక సీమంతాలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ ప్రతి గర్భిణీ స్త్రీ ఆసుపత్రిలో రిజిస్ట్రేషన్ చేయించుకుని డెలివరీ సమయం వరకు వైద్యుల సూచన మేరకు వైద్య పరీక్షలు చేయించుకుని దానికి అనుగుణంగా మందులు తీసుకోవాలన్నారు. గర్భిణీ స్త్రీలు బయట హోటల్స్ ఆహార పదార్థాలు, కూల్ డ్రింక్స్, చాక్లెట్స్ వంటి తినుబండారాలు తినకూడదని స్పష్టం చేశారు. ఎప్పుడైతే తల్లులు మంచి పోషకాహార తీసుకుంటారో పుట్టే పిల్లలు బలంగా పుడతారన్నారు. ఈ నేపథ్యంలో పసుపు కుంకుమ గాజులు చీరలు,పండ్లు మిఠాయిలు పెట్టి 15 మంది గర్భిణీలకు సామూహిక సీమంతల కార్యక్రమం నిర్వహించి వివిధ రకాల ఫలాల కిట్ ను అందజేసి ఆశీర్వదించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *