సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గర్ల్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆంధ్రప్రదేశ్ అధ్వర్యంలో రాష్త్ర వ్యాప్తంగా జులై 14-23 వరకు “మార్పు – జీవితం అంతంకాక ముందే ” అనే నినాదంతో నిర్వహించబడుతున్న రాష్ట్రవ్యాప్త ఉద్యమంలో భాగంగా నేడు, సోమవారం భీమవరం పట్టణంలోని వండర్ కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థినుల కొరకు “విద్యార్థుల్లో – నైతిక మార్పు” అనే అంశం పై ఒక క్యాంపస్ లెక్చర్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సోదరి ఫర్జానా మాట్లాడుతు విద్యార్దులకు విద్యతో పాటు మంచి విలువలు బోధించడం ద్వారా వారి వ్యక్తిత్వంలో గొప్ప మార్పు తీసుకురాగలమని, నేడు మన మంచి అలవాటులే రేపటి దేశాభివృద్ధికి పునాదులు అని చెప్పారు. మరొక సోదరి నిఖ్ఖత్ మాట్లాడుతూ టెక్నాలజీ పరంగా మనం ఏ విధంగా మార్పు కోరుకుంటున్నామో, నైతిక పరంగా కూడా మార్పు కోరుకోవాలని, ఆ దిశగా ప్రతిఒక్కరు తమను తాము మలచుకోవాలనే ఉద్దేశ్యంతో ఇటువంటి అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్, ప్రిన్సిపాల్ మరియు స్కూల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *