సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం డిఎన్నార్ కళాశాల అసోసియేషన్ సెక్రటరీ అండ్ కరెస్పాండంట్ గాదిరాజు సత్యనారాయణ రాజు (బాబు )ను వారి కుటుంబ సభ్యులను రాష్ట్ర మంత్రి రామానాయుడు పరామర్శించారు. బాబు వారి తండ్రి ఈనెల 19న మృతి చెందారు. సోమరాజు (94) చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మంత్రి మాట్లాడుతూ.. సోమరాజు మంచి మానవతా విలువలు కలిగిన మహోన్నతమైన వ్యక్తి అని సూపెరిండెంటెంట్ ఇంజినీర్ గా రోడ్లు భవనాల శాఖలో గొప్ప సేవలు అందించారని, వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని అన్నారు. కార్యక్రమంలో టిడిపి నేతలు కోళ్ల నాగేశ్వరరావు, ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు, వేండ్ర శ్రీను, రేవు వెంకన్న, ఉప్పులూరి చంద్రశేఖర్, మైలబత్తుల ఐజాక్ బాబు, పాల పెద్ద అబ్బులు, అంగర వెంకట్, చెల్లబోయిన గోవింద్ తదితరులు పాల్గొన్నారు.
