సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత రాత్రి నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా భీమవరం పట్టణం గునుపూడి ప్రాంతంలో తాడేరు వంతెన వద్ద జరిగిన రాళ్ళ దాడి లో గాయపడి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైసీపీ కార్యకర్తల్ని మరియు గునుపూడి లో ఇంటి వద్ద చికిత్స పొందుతున్న వ్యక్తి ని నేడు, బుధవారం ఉదయం శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు పరామర్శించారు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు, ఈ సంఘటన ను ఆయన తీవ్రంగా ఖండించారు. లోకేష్ ను ఉద్దేశించి .. నాయకులు పాదయాత్రలు చేస్తున్నప్పుడు వ్యక్తిగత విమర్శలు చెయ్యడం మానుకోవాలని.. భీమవరంలో ఎప్పడు లేని విధముగా ఈ దాడులలో పలువురు గాయపడటం దురదృష్టకరమని.. పార్టీల కోసం పనిచేసేవారు ఎవరు గాయపడ్డ బాధాకరమేనని .. స్థానిక టీడీపీ నేతలు కూడా ఇది గమనించాలని, పోలీసులు కూడా పరిస్థితుల పట్ల మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు
