సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, బుధవారం గురజాడ అప్పారావు జయంతి సందర్భంగా రాజా రామ్మోహన్ రాయ్ ద్విశత జయంతి సందర్భముగా భీమవరం స్థానిక ఆర్ ఆర్ డి యస్, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు విభాగం ఆధ్వర్యంలో సభ నిర్వహించి ఘన నివాళులర్పించారు . ముఖ్య వక్తగా విచ్చేసిన అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ సేవా విజ్ఞాన కేంద్రం కార్యదర్శి రాధాకృష్ణ మాట్లాడుతూ.. ఒక జాతి ,ఒక దేశం అభివృద్ధి చెందే ప్రణాళికను గేయంగా అందించిన మహాకవి, జాతీయకవి ,కవిశేఖర గురజాడ అప్పారావు అని .. దేశమును ప్రేమించుమన్నా ..మంచి అన్నది పెంచుమన్నా ..అన్న గీతం జాతీయగీతం గా, విశ్వగీతముగా గుర్తింపు పొందవలసిన ఆవశ్యకత ఉందన్నారు. గురజాడ రచించిన కన్యాశుల్కం నాటకం లక్షలది ప్రదర్శనలు ఇచ్చిందన్నారు. సభకు అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపల్ డా,వికెజే ప్రసూన మాట్లాడుతూ సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా గురజాడ రచనలు చేశారన్నారు. ఆయన రచనలు ఎంతో అభ్యుదయ మైనవని, బాలికల, మహిళల భవిష్యత్తు కోసం రచనలు చేసారని, నేటి యువత, విద్యార్థులు తెలుసుకొని వారి జీవితాలను ఆదర్శప్రాయంగా మార్చుకోవాలన్నారు. సాహితి స్రవంతి కార్యదర్శి చైతన్య ప్రసాద్ ,తెలుగు విభాగాధిపతి డా, కాకుమాని శ్రీనివాసరావ. వైస్ ప్రిన్సిపల్ లక్ష్మీకాంతం, అధ్యాపకులు,విద్యార్థులు పాల్గొన్నారు..
