సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, మంగళవారం గురుపూజోత్సవం పర్వదినం సందర్భముగా భీమవరం లోని అన్ని విద్యాసంస్థలలో ఘనంగా నిర్వహిస్తూన్నారు. తరగతి గదులను చక్కగా అలంకరించి విద్యార్థులు వారి వారి గురువులను ఘనంగా సన్మానిస్తూ వారి అస్సిసులు అందుకుంటున్న నేపథ్యంలో .. ప్రతిరోజూ ఉదయం పూట ఆరోగ్యం కోసం .. భీమవరంలోని ప్రముఖ సీనియర్ వ్యాపార వేత్తలు తో కూడిన ‘కాఫి క్లబ్’ లోని సభ్యులు నేటి ఉదయం స్థానిక డి ఎన్ ఆర్ కాలేజీలో పనిచేసిన ARKR లెక్చరర్ ను ఘనంగా పూలమాలలు వేసి శాలువా కప్పి పళ్ళు, చిరుకానుకలుతో సత్కరించారు. ఆయన లెక్చరర్ గా ఎందరో ఉత్తమ విద్యార్థులను తయారు చేసారని వారందరు ఉన్నత స్థాయిలో ఉన్నారని ప్రశంసించారు. ఈ కార్యక్రమం లో కారుమూరి సత్యనారాయణ, బొండాడ రాంబాబు, ఓలేటి శ్రీనివాస్, భట్టిప్రోలు శ్రీనివాస్ , బొండాడ హనుమంతరావు , కొల్లిపర్ల సుబ్బారావు తదితర వ్యాపారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *