సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం లో పలు విద్య సంస్థలలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా గురుపూజోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించి ఉపాధ్యాయులను ఘనంగా విద్యార్థులు సన్మానాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో భీమవరం విష్ణుపూర్ లోని బి.వి రాజు కాలేజ్ ఆడిటోరియం నందు జిల్లా కలెక్టర్ , ప్రశాంతి ఆధ్వర్యంలో జరిగిన గురుపూజోత్సవం వేడుకలలో , రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి, ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ మరియు స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పాల్గొని మాజీ భారత రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళ్లు అర్పించి , ఆయన ఉపాధ్యాయుడుగా చేసిన సేవలను కొనియాడారు. జన్మ నిచ్చిన తల్లి తండ్రుల తరువాత యువత భవిషత్తు కు గురువే మార్గదర్శి అని, అటువంటి గురువు లను పొందిన విద్యార్థి అదృష్టవంతుడని కొనియాడారు.ఈ సందర్భముగా పశ్చిమ గోదావరి జిల్లా లో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికయిన సీనియర్ లకు శాలువాలు కప్పి, జ్ఞాపికలు అందజేసి ఘనంగా సన్మానం చేసి అభినందించడం జరిగింది. సత్కారం పొందిన ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. ప్రతి వ్యక్తి , విద్యార్థి ముందు క్రమ శిక్షణ అలవర్చుకోవాలని , ఉత్తమ గురువుల ను అనుసరిస్తే మంచి జీవితం, తద్వారా దేశ శ్రేయస్సు లభిస్తుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమం శ్రీ విష్ణు విద్యాసంస్థల సిబ్బంది సహకారంతో జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *