సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో శ్రీ షిరిడి సాయి బాబా వారి సన్నిధి ని తలపించే విధంగా భీమవరం పెదమిరం లో శ్రీ స్వర్ణ సాయి మందిరంలోను సిసిలీ లోని శ్రీ సాయి బాబా మందిర్, మారుతి సెంటర్ లోని జిల్లాలో సుమారు 70 ఏళ్ళ క్రితం ఏళ్ళ క్రితం నిర్మించిన మొదటి సాయి బాబా మందిర్ లోను , 14 వ వార్డు లోని మినిషిరిడి లోను రేపు బుధవారం ‘గురుపూర్ణిమ” వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. సాయి మందిరాలు పండ్లు పుష్ప అలంకరణలు, ప్రత్యేక అభిషేకాలు ప్రసాద వితరణలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. పెదమిరంలో ఉదయం 7గంటల నుండి 11 గంటల వరకు శ్రీ బాబా వారిని భక్తులు స్వయంగా ఆవుపాలు, పంచామృతాలతో అభిషేకించే అవకాశం నిర్వాహకులు కల్పిస్తున్నారు. యాగాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.రాత్రి 10 గంటల వరకు ఆధ్యాత్మిక కార్యక్రమాలు తో పాటు అన్న సమారాధన, ఏర్పాట్లు కూడా చేసారు. ఓం..సాయి రామ్.
