సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం లో గృహ నిర్మాణ లబ్ధిదారులు త్వరగా నిర్మాణాలు చేపడితే వారికి బిల్లులు సకాలంలో ప్రభుత్వం నుంచి వస్తాయని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. నేడు, శనివారం ఉదయం భీమవరం పైపుల చెరువు వద్ద ఏర్పాటు చేసిన మన ఇల్లు – మన గౌరవం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ.. అన్ని రకాల మౌలిక సదుపాయాల కల్పన, సకాలంలో బిల్లుల చెల్లింపు, ఇసుక, సిమెంటు, ఇనుము సరఫరా చేసి, లబ్ధిదారులు ఇళ్లు పూర్తి చేసుకోవడానికి చర్యలు తీసుకుంటామన్నారు. అవసరమైన వారికి డీఆర్డీఏ ద్వారా రుణాలు సైతం మంజూరు చేయిస్తామని తెలిపారు. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ ప్రధాన మంత్రి ఆవాస యోజన పథకంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న పేదల ఇళ్ళు నిర్మాణాన్ని వచ్చే ఏడాది మార్చిలోగా పూర్తి చేస్తుందని, ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసిందన్నారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు పార్టీ నాయకులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *