సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరం నియోజకవర్గంలో లో నేడు, శనివారం కొత్త ఏడాది ప్రారంభ సందర్భముగా, స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అయన కార్యాలయం వద్ద నేటి , ఉదయం 7గంటల నుండి ప్రజలు, వేలాది మంది అభిమానులు, వైసిపి క్యాడర్ లతో భారీ సందడి నెలకొంది. ( గత 3 దశాబ్దాల నుండి గ్రంధి వారి ఇంట రాజకీయాలతో సంబంధం లేకుండా అభిమానుల సంబరం ఇది మాములే.. అయినప్పటికీ) మధ్యాహ్నం 12 దాటినా ఎడతెగని ప్రజలు క్యూ లైన్ లో నిలబడి గ్రంధి శ్రీనివాస్ ను కలసి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆయన కూడా మాస్క్ ధరించి ప్రతి ఒక్కరిని ఓపికతో నిలబడే చిరునవ్వుతో పలకరిస్తూ వారి శుభాకాంక్షలు అందుకోవడం జరిగింది. నియోజక వర్గ ప్రజలు సుఖశాంతులతో 2022 లో మరింత అభివృద్ధి సాధించాలని , సీఎం జగన్ సహకారంతో తనవంతు కృషి చేస్తానని MLA గ్రంధి శ్రీనివాస్ సిగ్మా న్యూస్ తో అన్నారు..వచ్చిన వేలాది మందికి టిఫిన్, భోజన ఏర్పాట్లు చేసారు. గ్రంధి శ్రీనివాస్ కుమారుడు గ్రంధి రవితేజ వచ్చిన నేతల నుండి కార్యాలయ బయటే శుభాకాంక్షలు అందుకొంటూ నిలబడటం గమనార్హం. ఇక శాసన మండలి చైర్మెన్ కొయ్యే మోషేను రాజు వేడుకలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే..
