సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్::భీమవరం లో మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ జన్మదిన వేడుకలు నేడు, సోమవారం ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. అయితే ఎప్పటగతంలో మాదిరిగానే గ్రంధి శ్రీనివాస్ మాత్రం జన్మదిన వేడుకలకు దూరంగా ఉండటం గమనార్హం. అయితే స్థానిక వైసీపీ నేతలు తోటబోగయ్య, కోడె యుగంధర్, మారాజు గణేష్ తదితరులు ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి లోని రోగులకు పాలు, పండ్లు, రొట్టెలు పంపిణి చెయ్యడం తదుపరి వీరమ్మ పార్క్ సెంటర్లో పేదలకు భోజనాలు పంచిపెట్టడం జరిగింది. ఇక స్థానిక 29వ వార్డులో 60 మంది ప్రజలకు గ్రంథి శ్రీనివాస్ సేవా సమితి ఆధ్వర్యంలో భోజనం ప్యాకెట్లు, ఫ్రూట్స్, బిస్కెట్ ప్యాకెట్స్ ను పంపిణీ చేసారు A.M.C మాజీ డైరెక్టర్ గంటా అనితా రాణి, దళిత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు గంటా సుందర్ కుమార్. ఈ కార్యక్రమంలో గంటా రాహుల్, గొల్ల రాజ్ కుమార్, పట్టెం శుభాకర్ తదితరులు పాల్గొన్నారు ఇంకా నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో గ్రంధి శ్రీనివాస్ అభిమానులు భారీ ఫ్లెక్సీ లు కట్టి ప్రజా హిత కార్యక్రమాలు చెప్పట్టారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *