సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నియోజకవర్గం వీరవాసరం మండలం అండలూరు మరియు రాయకుదురు జనసేన పార్టీ గ్రామ కమిటీలను పార్టీ జిల్లా అడ్జ్యాక్షుడు , భీమవరం నియోజకవర్గం ఇంఛార్జి కొటికలపూడి గోవిందరావు నియమించారు. నేటి ఆదివారం ఉదయం వీరవాసరం మండలం పార్టీ కార్యాలయం నందు గోవిందరావు మండల అధ్యక్షులు పుప్పాల బాలాజి,Mptc లు,నాయకుల సమక్షంలో కమిటీల వివరాలను విడుదల చేశారు. ఈ సందర్భముగా చినబాబు మాట్లాడుతూ .. మరి కొద్ది రోజుల్లోనే మండల కమిటీని మరియు మిగిలిన గ్రామ కమిటీలను నియమించి రాన్నున రోజుల్లో మరింత బలంగా ముందుకు వెళ్తామని తెలియజేశారు. ఈ సమావేశంలో వైస్ ఎంపీపీ అద్దాల రాము,ఎంపీటీసీ లు గుల్లిపల్లి విజయలక్ష్మీ ,వెంకటలక్ష్మి ,సర్పంచులు వెండ్రా లీలా,నాయకులు మోపిదేవి విశ్వేశ్వర్ రావు , పెంటకోటి సూర్య ప్రకాష్, సూరి రావు,భాస్కరరావు , గ్రామ కమిటీ సభ్యులు తదితర నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *