సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం బ్రాండ్, అంతర్జాతీయ స్టార్ సినీ హీరోగా వెలుగుతున్న ప్రభాస్ పుట్టిన రోజు వేడుకలు నేడు, ఆదివారం ‘డార్లింగ్ ప్యాన్స్’ ప్రపంచ వ్యాప్తంగా జరుపుకొంటున్నారు. హైదరాబాద్ లో ప్రాజెక్ట్ కే సినిమా షూటింగ్లో నేడు ప్రభాస్ పుట్టినరోజు వేడుకలు నిర్మాత అశ్వనీదత్, దీపికా పదుకొనె సమక్షంలో అభిమానులు నిర్వహించారు. ఇక భీమవరం విషయానికి వస్తే .. భీమవరం పరిసర ప్రాంతాలలో నేడు, ప్రభాస్ అబిమానులు పలు చోట్ల అన్నసమారాధన, వస్త్ర దానాలు చేసారు. ఇక భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ తో కలసి ఆయన కార్యాలయంలో ఆయనతో కలసి ప్రభాస్ అభిమానులు కేక్ కట్ చేసి భీమవరం నుండి ప్రభాస్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ.. మన ప్రాంతం నుండి వెళ్లిన ప్రభాస్ తెలుగు హీరో నుండి అంతర్జాతీయ స్థాయి హీరోగా ఎదగడం మనందరికీ గర్వకారణమని, దీనిలో అతని కృషి, ఎంత ఎదిగిన తగ్గి మాట్లాడే తత్వం, ప్రభాస్ అభిమానుల క్రమ శిక్షణ , సామాజిక సేవలు, ఇమిడి ఉన్నాయని , స్వర్గీయ కృష్ణంరాజు అస్సిసులు ప్రభాస్ కు అండగా ఉంటాయని, ఇక వచ్చే సినిమాలు ఘన విజయాలు సాధించాలని పేర్కొంటూ ప్రభాస్ కు,అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు.
