సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం డి ఎన్ ఆర్ కాలేజీ గ్రౌండ్ లో గత 10 రోజులుగా విశాలమైన చలువ పందిళ్ళలో పలు యాగశాలలో హోమద్రవ్యాలతో అనేక మంది వేదపండితుల మంత్రోచ్ఛరణలతో జరుగుతున్నా రాజ్య శ్యామల, అతి రాత్ర మహా యాగంలో చివరి అంకంగా నేడు,శనివారం పూర్ణాహుతి’ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. వందలాది మంది దంపతులు ఈ కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది. 32 హోమ గుండాల యాగశాలలో చక్కటి గోవులను అశ్వాలను ఏర్పాటు చేసారు. పవిత్ర నది జలాలతో భక్తులను ఆసిర్వదించారు. నేటి సాయంత్రం మధ్యాహ్నం ఒంటి గంటకు పూర్ణాహుతి నిర్వహించి నేటి సాయంత్రం 7 గంటలవరకు పలు విశేష యాగములుతో పుత్రకామేష్టి యాగముతో కార్యక్రమాలు పరి సమాప్తి చేసారు. నేటి మద్యాహ్నం అక్కడి రామకృష్ణ సభ మండపంలో భక్తులకు విశేష అన్నసమారాధన జరిగింది. యాగశాల వద్ద హోమం హోమద్రవ్యాలు చెట్టు వేరులు గంధపు చెక్క ముక్క నవ ధాతువులు కలపి 100 రూపాయలుకే భక్తులకు అందుబాటులో ఉంచడం తో భక్తులు హోమంలో స్వయంగా పాల్గొన్న అనుభూతి చెందారు. అయితే పూర్ణాహుతి ముగిసాక “కంకణధారణ” చేసి వెళ్లాలని అప్పుడే యాగఫలం సిద్ధిస్తుందని పురోహితులు వేదికపై ప్రకటించగా.. కంకణాలు ( కాస్త బలమైన ఎర్రని దారం 6 అంగుళాల ముక్క ) ఒకొక్కటి 100 రూపాయలకు విక్రయించడం నివ్వెరపరచింది. అయితే భక్తులు భారీ క్యూ లైన్ లలో నిలబడి వారి కుటుంబసభ్యులకు కావలసిన కంకణాలను వందలాది రూపాయలు చెల్లించి కొనుగోలు చెయ్యడం జరిగింది. పవిత్ర కంకణాలు ను భక్తుల స్వయం వితరణకు వదిలేసి ఉంటె మంచిదని భావన..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *