సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నియోజకవర్గం తెలుగుదేశంపార్టీ ఇంచార్జ్ టిడిపి రాష్ట్ర పోలీట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మీ ఆధ్వర్యంలో నేడు, ఆదివారం కిరాణా మర్చంట్స్ అసోసియేషన్ భవనము నందు 44వ టిడిపి ఆవిర్భావ దినోత్సవఘనంగా వేడుక నిర్వహించారు. గత వారం రోజులుగా పట్టణంలోని వివిధ వార్డులలో నూతనంగా నిర్మించిన జండా స్తూపాలు ప్రారంభించి టిడిపి జెండా ఆవిష్కరించారు. తాజా సమావేశంలో ముందుగా టిడిపి జెండా ఆవిష్కరణ, మా తెలుగు తల్లి గీతాలాపన స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అనంతరం మంగళగిరి టిడిపి కేంద్ర కార్యాలయము నుండి వర్చువల్ సమావేశం ద్వారా నారా చంద్రబాబు, లోకేష్ ప్రసంగాన్నివీక్షించిన టిడిపి నాయకుల సభలో తోట సీతారామలక్ష్మీ మాట్లాడుతూ.. 43 సంవత్సరాల క్రితం మార్చి 29న స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశంపార్టీ ద్వారా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని తెలుగుదేశంపార్టీకి కార్యకర్తలే అండ అని, కష్టపడ్డ కార్యకర్తల అందరికి పార్టీ గౌరవప్రదమైన పదవులను కేటాయిస్తుందన్నారు. టిడిపి రాష్ట్ర కోశాధికారి, మెంటే పార్థసారథి ,పశ్చిమగోదావరి జిల్లా టిడిపి అధ్యక్షుడు ఏపీఐఐసి చైర్మన్ మంతెన రామరాజు మాట్లాడుతూ..అన్న ఎన్టీఆర్ నెలకొల్పిన తెలుగుదేశంపార్టీ దేశ రాజకీయాలలోనే ప్రత్యేక గుర్తింపు పొందిందన్నారు. తదుపరి, మెరుగని రారాయణమ్మ, కోళ్ల నాగేశ్వరరావు, వెండ్ర శ్రీనివాస్,మామిడి శెట్టి ప్రసాద్ మాట్లాడుతూ .. అన్న ఎన్టీఆర్ అనేక సంక్షేమ పథకాలను పరిచయం చేశారని ముఖ్యంగా బీసీలకు రాజకీయ పదవులను కేటాయించి బీసీలకు పెద్దపీట వేశారన్నారు. ఈ సమావేశంలో టిడిపి సీనియర్ నాయకులకు, సాల్వాలతోసన్మానించి జ్ఞాపికలనుఅందజేశారు. నియోజకవర్గంలోని కీలక నేతలు, కార్యకర్తలు అందరు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *