సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరం మార్కెట్ యార్డ్ లో నేడు, సోమవారం ఏర్పటు చేసిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్నిజిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రారంభించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరులు చిరస్మరణీయులని వారి త్యాగాలను స్మరించుకోవడం మనందరి బాధ్యత అని, మాతృభూమి శ్రేయస్సు కోసం, ప్రజలకోసం పని చేసిన నిస్వార్థ శ్రామికులు పోలీసులు అని అన్నారు జిల్లా కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అద్నాన్ నయీం అస్మి, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, అడిషనల్ ఎస్పీ వి.భీమారావు, జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి పోలీస్ అమరుల స్థూపం వద్ద పుష్పగుచ్చాలను వుంచి వారిని స్మరించుకుంటూ శ్రద్ధాంజలి ఘటించారు. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి మాట్లాడుతూ మేము విధి నిర్వహణ పరమావదిగా భావిస్తామని, 1959వ సంవత్సరములో భారత సరిహద్దులలోకి చొచ్చుకొని వచ్చిన చైనా బలగాలు, భారత్ – చైనా సరిహద్దులలోని అక్షయచిన్ అనే ప్రదేశము వద్దమాటు వేసి మన భారత సిఆర్ పిఎఫ్ జవానులపై కాల్పులకు తెగబడ్డారని, ఫలితంగా 10 మంది భారత సిఆర్ పిఎఫ్ జవానులు వీరమరణం పొందారని అన్నారు. మన భారత జవాన్ల త్యాగాలను స్మరిస్తూ ప్రతీ సంవత్సరం “పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం”గా జరుపుకుంటున్నామని అన్నారు. ఇక స్థానిక ఎమ్మెల్యేలు, మండలి చైర్మెన్ మాట్లాడుతూ.. సమాజం పట్ల పోలీసులు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. ప్రజల్లో అభిమానం గౌరవం పొందేలా ప్రతీ పోలీసు విధులు నిర్వహించాలని, జిల్లా పోలీసు శాఖ బాధిత కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. తొలుత జిల్లా పోలీసు శాఖ రూపొందించిన అమర వీరుల గ్రంథంలో దేశ రక్షణలో ప్రాణ త్యాగం చేసిన అమర వీరుల పేర్లను (రోల్ ఆఫ్ హానర్) జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మికి అందజేశారు. మన పశ్చిమ గోదావరి జిల్లాలోని విధినిర్వహణలో అమరులైన 4 గురు పోలీసులు ఎ నాగేశ్వరరావు, డి పీటర్, డిహెచ్ విజి శ్రీనివాస్, ఎస్విఎస్ఎన్ ఆచార్యులు (ప్రత్యర్థి దాడులులో అమరులై ప్రాణాలర్పించారు,) వారి త్యాగాలకు గుర్తుగా వారి కుటుంబాలకు జ్ఞాపకాలను అందజేసీ సత్కరించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ నాదెళ్ల బాలాజీ మారుతి మురళీకృష్ణ, జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, ఎక్సైజ్ సూపరీంటెండెంట్ ఆర్ఎస్ కుమారేశ్వరన్, జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ డీఎస్పీ ఎం సత్యనారాయణ, భీమవరం డిఎస్పీ రావూరి గణేష్ జయసూర్య, తాడేపల్లిగూడెం డీఎస్పీ డి.మ్ విశ్వనాథ్, , భీమవరం ఆర్డీవో ప్రవీణ్ కుమార్ రెడ్డి, తహశీల్దార్ రావి రాంబాబు, పోలీసు అధికారులు, పోలీసులు, ప్రజలు, వివిధ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.
